బీరు బాటిల్‌ లో మందు పాతర

Drug role medicine-in-a-beer-bottle

బీరు బాటిల్‌ లో మందు పాతర

MaoistRebelsArt
క్రైమ్ బ్యూరో పెన్ పవర్ ఖమ్మం, అక్టోబరు 16: 


తమను వేటాడుతున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు భారీ ప్లాన్‌ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా.. బీరు సీసాలో మందుపాతరను అమర్చారు. భద్రతా బలగాలు ముందే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. పూసుగుప్ప అడవుల్లో ఈ ఘటన జరిగింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు భారీ ప్లాన్‌ వేశారు. భద్రతా బలగాలే లక్ష్యంగా బీరు సీసాలో మందుపాతలను అమర్చారు. మూడుచోట్ల అమర్చిన మందుపాతరలను భద్రతా బలగాలు గుర్తించాయి. బీరు సీసాల్లో ఇంప్రూవైజ్డ్‌ ఎక్సప్లోజివ్‌ డివైజ్‌ (ఐఈడీ) లను అమర్చారు. సీఆర్పీఎఫ్‌`81 బలగాలు కూంబింగ్‌ చేస్తున్న సమయంలో ఇవి కనిపించాయి. వీటిని జాగ్రత్తగా వెలికితీసి పేల్చేశారు. స్థానిక సీఐ రాజువర్మ వీటి గురించి భద్రతా బలగాలతో చర్చించారు.మావోయిస్టులపై దాడులతోపాటు.. లొంగుబాటును ప్రోత్సహించేందుకు కేంద్రం ఆలోచన చేస్తోంది. మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా అండుగులు వేస్తోంది. ఇందుకు ఉమ్మడి ఏపీలో అనుసరించిన విధానాలపై అధ్యయం చేయించే యోచన కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతి చర్చలు జరిగాయి.గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యాకలాపాలు సాగేవి. కానీ.. ప్రస్తుతం ఒక్క ఛత్తీస్‌ఘడ్‌లోనే వీరి ఉనికి గట్టిగా ఉన్నట్టు కేంద్రం ఒక అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో.. ఛత్తీస్‌ఘడ్‌లోని దండకారణ్యంపై భద్రతా బలగాలు ఫోకస్‌ పెట్టాయి. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసుకొని వేట కొనసాగిస్తున్నాయి.దండకారణ్యంలో భద్రతా బలగాలు ఇప్పటికే 47 క్యాంపులు ఏర్పాటు చేశాయి. మరో 16 క్యాంపులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్యాంపుల ద్వారా జరిపిన ఆపరేషన్లలో ఇప్పటివరకు 230 మంది మావోయిస్టులు చనిపోయారు. 812 మంది అరెస్టయ్యారు. 723 మంది లొంగిపోయారు. ఈ ఒక్క ఏడాది కాలంలోనే ఏకంగా 1765 మంది మావోయిస్టులు తగ్గిపోయారు.ఒక్క ఏడాదిలోనే 1765 మంది బలం తగ్గడంతో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గాయని తెలుస్తోంది. అయితే.. కేవలం దండకారణ్యంలో మాత్రం వీరి కార్యకలాపాలు సాగుతున్నాయి. దీంతో బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఈజీగా వారిపై పైచేయి సాధించవచ్చనే అభిప్రాయంలో భద్రతా బలగాలు ఉన్నాయి. అందుకే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ దూసుకెళ్తున్నాయి. వీరిని ఎదుర్కొవడానికి మావోయిస్టులు కూడా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల