విరివిగా రక్తదానం చేయండి ... జిల్లా కలెక్టర్ పిలుపు..


అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం/పాడేరు,పెన్ పవర్ ఫిబ్రవరి 18 :- ఏజెన్సీలోని యువతి యువకులు విరివిగా రక్తదానం చేయలని అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం క్యాంపుకు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం, రంపచోడవరం సబ్ కలెక్టర్ కె ఆర్ కల్ప శ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజనులకు అత్యవసర సమయంలో రక్తం కావలసి ఉన్నప్పుడు రోగులకు రక్తం ఇచ్చే విధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని ఆయన అన్నారు. గత మూడు సంవత్సరాల నుండి 11 ఈ మండలాలలో 2560 యూనిట్లు రక్తదాతలు రక్తం ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. యువతి యువకులు ఎవరైనా అహుత్సాహికులు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని ఆయన అన్నారు. రక్త దాతలు అపోహలకు తావు లేకుండా రక్తదానం చేయాలని ఆయన అన్నారు. ఈనెల 19వ తారీకున అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తవుతుందని ఆయన అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బాల్య వివాహాలు, సికిల్ సెల్ ఎనీమియా, గంజాయి నివారణపై అవగాహన కల్పించి నివారణకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. రంపచోడవరం మండలం రంప గ్రామంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 45 మంది వృద్ధులకు రగ్గులు పంచిపెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ నెల 19వ తారీకు బుధవారం చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన తెలిపారు. ఏజెన్సీ లోను యువతి యువకులు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి నిరుపేద గిరిజనుల ప్రాణాలు అత్యవసర సమయంలో కాపాడాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు బొర్ర. నాగరాజు, జిల్లా వైస్ చైర్మన్ ఎస్ గంగరాజు, కార్యదర్శి జి. గౌరీ శంకర్, కోశాధికారి పి సూర్యారావు, కార్యవర్గ సభ్యులు ప్రసాద్ నాయుడు, మర్లమని, జిల్లా కోఆర్డినేటర్ లోహితస్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె. వసుధ,, డాక్టర్ యం.స్పందన, సిబ్బంది సత్తిబాబు, పండు తదితరులు పాల్గొన్నారు.

(రిపోర్టార్:మాదిరి చంటిబాబు)IMG-20250218-WA0682

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.