ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను

పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు 

స్టా

IMG-20240707-WA0000
ఎమ్మెల్యే మత్స్య రాస విశ్వేశ్వర రాజు

ఫ్ రిపోర్టర్ పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై :7అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే మత్స్య రాస విశ్వేశ్వర రాజు ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన జి.మాడుగుల మండలం కిల్లం కోట గ్రామానికి ఆదివారం రావటం జరిగింది. గ్రామంలో అతనికి సాదర స్వాగతం లభించింది. కిల్లంకోటలో ఆయన పెన్ పవర్ తో మాట్లాడుతూ నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఋణపడి ఉంటానని, నాకు ఓటు వేసి గెలిపించిన నా నియోజకవర్గ ప్రజల ఋణం తీర్చుకోవటానికి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని విశ్వేశ్వర రాజు అన్నారు. గిరిజన సమస్యల కోసం పోరాటం చేస్తామని, జీవో నెంబర్ 3 అమలు చేయాలని డిమాండ్ చేశారు.1/70 యాక్ట్ సక్రమంగా అమలు జరగాలని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ కార్యదర్శి సురేష్ కుమార్, జీకే వీధి ఎంపీటీసీ పసుపులేటి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి