రేపు పాఠశాలలకు సెలవు : జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
On

స్టాఫ్ రిపోర్టర్ /గూడెం కొత్తవీధి,పాడేరు,పెన్ పవర్ జూలై 22: అల్లూరి సీతారామరాజుజిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ఈనెల 23వ తేదీన అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించామని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ .దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు సెలవు అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులను తల్లిదండ్రులు బయటకు పంపించకూడదని చెప్పారు. అదేవిధంగా ప్రజలు గెడ్డలు, వాగులు దాటి ప్రయాణించ కూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొన్నారు.
Tags:
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.