ఎన్టీఆర్ గృహాలకు బిల్లులు మంజూరు అయ్యేనా...!

👉వైసీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గృహాలకు బిల్లులు నిలిపివేత 

👉

IMG-20240715-WA0003
అసంపూర్తి నిర్మాణాలతో ఎన్టీఆర్ గృహం

ప్రభుత్వం మారటంతో ఆశగా చూస్తున్న ఎన్టీఆర్ గృహ లబ్ధిదారులు 

స్టాఫ్ రిపోర్టర్ మాదిరి చంటిబాబు,పాడేరు/గూడెం కొత్తవీధి/పెన్ పవర్,జూలై 15:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు సొంతింటి కల నెరవేర్చటం కొరకు ఎన్టీఆర్ గృహాలను అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేసింది.సుమారు లక్ష 50 వేల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుండటంతో సొంతింటి కలలు నెరవేర్చుకోవటానికి లబ్ధిదారులు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు.రేకుల షెడ్లను, పూరిళ్లను కూలదోసి పక్కా గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు.పునాది దశ నుండి స్లాబ్ వరకు నిర్మాణాలు చేపట్టారు.అనంతరం ఎన్నికలు రావడంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైసిపి ప్రభుత్వం రావడంతో ఎన్టీఆర్ గృహాలకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో అసంపూర్తిగా ఆగిపోయాయి. అప్పటి నాయకులు బిల్లులు చేయిస్తామని చెప్పటమే కానీ వైసిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అయిపోయిన ఎన్టీఆర్ గృహాలకు బిల్లులు చేయకుండా మొండి వైఖరి చూపించింది.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇళ్ళ నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులు బిల్లుల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసి చివరకు ఆశ వదులుకున్నారు. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయటంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారులలో ఆశలు చిగురుస్తున్నాయి.గత ప్రభుత్వం అర్ధాంతరంగా తమ గృహాల బిల్లులను ఆపివేసిందని,ఎన్నో అప్పులు చేసి ఎన్టీఆర్ గృహ నిర్మాణాన్ని చేపట్టామని, బిల్లులు రాక ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపేసామని ప్రస్తుత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహాలకు బిల్లును మంజూరు చేస్తుందని ఆశ కలిగి ఉన్నామని,కావున జిల్లా అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి బిల్లులు మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టాలని ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారులు నూతన ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల