61 రోజుల పాటు సముద్ర జలాలో చేపల వేట నిషేదం..

61 రోజుల పాటు సముద్ర జలాలో చేపల వేట నిషేదం..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాలలో చేపలవేట చేయు యాంత్రిక పడవలు మేకనైజడ్ మరియు మోటారు బోట్లు ద్వారా నిర్వహించు అన్ని రకాల చేపలు వేట ను ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు ఆంటే 61 రోజుల పాటు  వేటను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులను జి. ఓ ఆర్ టి సంఖ్య 81ను జారీ చేశారు. సందర్భంగా మత్స శాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి మాట్లాడుతూ సముద్ర జలాలలో చేపల వేట నిషేధం యొక్క ముఖ్య ఉద్దేశ్యము వివిధ చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కాలములో తల్లి చేపలు మరియు రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడము, తద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరతను సాధించడము జరుగుతని,ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి, సముద్ర జలాలలో యాంత్రిక పడవలు (మేకనైజడ్ మరియు మోటారు బోట్ల) పై మత్స్య కారులు ఎటువంటి చేపలవేట చేయకుండా మత్స్య అభివృద్ధికి తోడ్పడాలని ఆమె కోరారు. నిషేధ ఉత్తర్వులను పుల్లంగించి చేపల వేట చేసిన యెడల ఆయా బొట్లు యజమానులను ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమ బద్ధీకరణ చట్టము (ఏపీ ఎం ఎఫ్ ఆర్ యాక్ట్ ) 1994, సెక్షన్ (4) ను అనుసరించి శిక్షార్హులు అని తెలియచేశారు. నిషేధిత సమయంలో వేట కొనసాగిస్తే వారి బోట్లను, బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీన పరుచుకొనుటయే గాక, జరిమానా విధిస్తూ, డీజిల్ ఆయిల్ రాయితీ మరియు ప్రభుత్వం అందించే అన్నీ రకముల రాయితీ సౌకర్యాలను నిలుపుదల చేయడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ నిషిద్ధ కాలమును ఖచ్చితముగా అమలు చేయుటకై మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ మరియు రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేయడమైనదని మత్స్యశాఖ కమిషనర్ ఏ .సూర్య కుమారి తెలియచేశారు .కావున మత్స్యకారులు అందరూ సహకరించవలసినదిగా ఆమె కోరారు.

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి