నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దారపనేని
            By  Admin              
On  
కనిగిరి నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు, మరియు వారి కుటుంబ సభ్యులకు కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. కఠోర దీక్షతో 30 రోజులు ఉపవాసాలు ఉండి నమాజులు చేస్తూ ఆ మహమ్మద్ ప్రవక్త కృపకు పాత్రులవుతారని, కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుకుంటూ సర్వమత సౌబ్రాతత్వంతో ఉండే పండుగ రంజాన్ అని దారపనేని పేర్కొన్నారు. రంజాన్ నమాజ్ తో పుణ్యఫలాలకు మార్గం సుగమం అవుతుందని ముస్లిం సోదరులందరూ నమాజ్ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దారపనేని తెలిపారు
Tags:  #andhrapradesh#prakasam

 
                  
          
          
          
          
                 
                 
                 
                 
                 
                 
                