ఎంఎస్ఆర్ గిరిజన కాలనీ శివారులో ఎల్ఈడీ కాంతులు.

ఎంఎస్ఆర్ గిరిజన కాలనీ శివారులో ఎల్ఈడీ కాంతులు.

మండల కేంద్రమైన గుడ్లూరులో ఉన్న  ఎంఎస్ఆర్ కాలనీ శివారు ప్రాంతంలో ఎల్ఈడీ బల్బులను పంచాయితీ అధికారులు బుధవారం ఏర్పాటు చేయించారు. వివరాల లోనికి వెళితే ఎంఎస్ఆర్ గిరిజన కాలనీ శివారు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో ఈ మధ్య కాలంలో విద్యుత్ అధికారులు స్తంభాలను ఏర్పాటు చేసి, కాలనీ వాసులకు లో-వోల్టేజ్ సమస్య లేకుండా విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం శివారులో ఉండటంతో రాత్రి సమయాల్లో విష పురుగులు తిరుగుతూ ఉండటంతో సమస్యను సర్పంచ్ పాలకీర్తి శంకర్  దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన సర్పంచ్ స్థానిక పంచాయితీ కార్యదర్శి పరుసు మహేష్ తో చర్చించి, సుమారు 30 ఎల్ఈడీ లైట్లను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసి, గిరిజన కాలనీ వాసులకు రాత్రుల్లో చీకటి సమస్యకు పరిష్కారం చూపారు. లైట్లు ఏర్పాటు చేయడంపై శివారు గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి