కనిపించిన నెలవంక.. నేడే రంజాన్ .

కనిపించిన నెలవంక.. నేడే రంజాన్  .

ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన ఈద్గా ప్రాంతం.

 ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్  పండుగ  గురువారం జరగనుంది. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించింది. రంజాన్ పండుగ జరుపుకునేందుకు అన్ని మసీదులలో ప్రకటించారు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.  రంజాన్ నెల ఆరంభం నుంచి 30 రోజులు పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారు . కంభం పట్టణంలో   13 కు పైగా మసీదులు ఉన్నప్పటికీ అందరూ ఈద్గా వద్దకు వెళ్తారు గ్రామీణ ప్రాంతాల సైతం ఈగ వద్దకే వస్తారు. వేసవి కాలం కావడంతో ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభిస్తారు. గ్రామీణ ప్రాంతాలైన హజరత్ గూడెం చిన్న కంభం తురిమెళ్ళ గ్రామాలలో కూడా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.ఈ నెలలో ముస్లింలు జకాత్ రూపంలో పేదలకు తమ ధనములో రెండున్నర శాతం సొమ్మును దానం చేస్తారు. ముస్లింలు చేసే ప్రార్థన నమాజ్ మానసిక పరివర్తన తెస్తుంది. నిర్మల మనసుతో పాటు మానసిక శారీరక ప్రశాంతత నేర్పుతుంది .ఇందులో భాగంగా రాత్రి చేసే ఇషా నమాజ్ తర్వాత 30 రోజుల రంజాన్ మాసంలో ప్రత్యేక తరావీ నమాజ్ కూడా ఆచరించారు.  ఈ మాసంలో సంపన్నులు పేద ముస్లిం వర్గాల వారికి దానధర్మాలు పేదలను ఆదుకోవడం జరిగింది.

About The Author

Advertisement

LatestNews

ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి
దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి,