బెల్ట్ షాపుల పై పోలీసుల దాడి

బెల్ట్ షాపుల పై పోలీసుల దాడి

పుల్లలచెరువు పెన్ పవర్ నవంబర్ 14:పుల్లలచెరువు మండలం రెంటపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్‌ షాపు పై పుల్లలచెరువు ఎస్ఐ సంపత్ కుమార్ గురువారం  దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మారబోయిన నాగార్జున ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఎనిమిది బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై సంపత్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో అక్రమంగా మద్యం అమ్మిన యెడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.ఎవరైనా బెల్ట్‌ షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, అమ్మినా పోలీస్ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

Tags:

About The Author

Related Posts