చట్టాల పై అవగాహన పెంచుకోవాలి

చట్టాల పై అవగాహన పెంచుకోవాలి

రంపచోడవరం మెజిస్ట్రేట్ బాబు

 

 

గిరిజనుల రక్షణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక చట్టాల పై గిరిజనులు అవగాహన పెంచుకోవాలని రంపచోడవరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పీ బాబు అన్నారు. శుక్రవారం రంపచోడవరం మండలం రంపలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం పురస్కరించుకొని మండల  న్యాయ సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు మెజిస్ట్రేట్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గిరిజనుల రక్షణ కోసం 1/70 చట్టం ,పీసా చట్టం తదితర ప్రత్యేక చట్టాలు ఉన్నాయని ఆయన వివరించారు. అలాగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం విశిష్టతను వివరించారు. గిరిజనులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తద్వారా యువత బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు .ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆదివాసీ దినోత్సవం, ఆదివాసి ప్రత్యేక చట్టాల గురించి వివరించారు. అనంతరం గ్రామంలోని వృద్ధులకు దుస్తులను పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ ,కోర్ట్ హెడ్ కానిస్టేబుల్స్ రమేష్ ,వెంకటేష్ ,దొర, సతీష్ ,నాగేశ్వరరావు, హరిబాబు, శివ, న్యాయవాదులు ఎం వి ఆర్ ప్రకాష్ ,భగవాన్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల