నగరం మధ్యలో నకిలీ మద్యం గుట్కా - వ్యక్తి అరెస్ట్
.
విశాఖపట్నం నగర హృదయంలోని సీతంపేట ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ ముఠాపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో కట్టమూరి రామకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నకిలీ మద్యం సరఫరా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం, రామకృష్ణ వద్ద నుంచి 70 నకిలీ మద్యం సీసాలు, 1.5 లీటర్ల హోమియోపతి స్పిరిట్, 225 ఖాళీ మద్యం సీసాలు, అలాగే 76 లిక్కర్ ప్యాకేజింగ్ కవర్ లేబుల్స్, మూతలును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సీఐ రవి కిరణ్, ఎస్ఐ ముసలి నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కేసు నమోదు చేసి రామకృష్ణను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నకిలీ మద్యం గుట్టును వెలికితీసేందుకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
About The Author

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.