మ్యుటేషన్లు వేగవంతం చేయండి,కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ వేగవంతం చేయాలి:జేసి డా. అభిషేక్  

👉ప్రజా ఫిర్యాదులు నాణ్యవంతంగా పరిష్కరించండి

👉ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగష్టు 27: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మ్యుటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని పెండింగ్ లో ఉన్న ఆర్ఓఆర్,ఎల్.టి. ఆర్,ఎల్ఎ,ఆర్అండ్ఆర్ కేసుల పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎం జే అభిషేక్ తహసిల్దార్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారులు, సబ్ కలెక్టర్లు,తహసిల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జేసి మాట్లాడుతూ,ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసం)కు అందిన ఫిర్యాదులు సకాలంలో నాణ్యవంతంగా పరిష్కరించి ఫిర్యాదుదారుకు తెలియజేయాలని,తిరష్కరిస్తే కారణాలు తెలియజేయాలని ఆదేశించారు.ముఖ్యంగా ఎస్ఎల్ఎ గడువులోగా పరిష్కరించాలని,ఎట్టి పరిస్థితులలో బిహైండ్ ఎస్ఎల్ఎ లేకుండా చూడాలని స్పష్టం చేసారు.భూ సేకరణకు సంబంధించి అవార్డుల ప్రదానానికి చర్యలు తీసుకోవాలని,సివిల్ డిపాజిట్స్ పరిష్కారం చేయాలని సూచించారు.వెబ్ ల్యాండ్ లో తప్పులు సవరించాలన్నారు. ప్రతి మంగళవారం సమీక్ష ఉంటుందని,ముందుగానే పూర్తి వివరాలు సమర్పించడంతో పాటు సమీక్షలలో వివరాలు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.ఆలస్యపు జనన మరణ ధృవపత్రాల జారీపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కేస్ట్,ఇన్కం సర్టిఫికెట్ల జారీని వేగవంతం చేయాలని ఆదేశించారు.ఉద్యాన మొక్కలు పంపిణీ, మొక్కలు నాతడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పధకం క్రింద పనులు కేటాయించాలని, వంద రోజుల పని దినాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసే దిశగా అన్ని ప్యాక్స్ ను కంప్యూటరీకరణ గావించాలని ఆదేశించారు.డిసిసిబి, కో-అపరేటివ్ సొసైటీలతో సంప్రదించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ బి.పద్మావతి,రంపచోడవరం నుండి ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం,మండలాల నుండి తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టార్:మాదిరి చంటిబాబు(స్టాప్ రిపోర్టర్)IMG-20240827-WA0508

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.