కన్నుల పండుగగా ప్రపంచ మేధావి డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

కన్నుల పండుగగా ప్రపంచ మేధావి డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

రావులపాలెం

 రావులపాలెం మండల వ్యాప్తంగా  ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అత్యంత కనులు పండుగ జరిగినవి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కొత్తపేట నియోజకవర్గ వై.యస్.ఆర్.సి.పి. ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా కోనసీమ ముఖద్వారం ,ఇందిరా కాలనీ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి  పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేకును చిర్ల జగ్గిరెడ్డి కట్ చేసి,అంబేద్కర్ అభిమానులకు పంచినారు.ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక కులానికో, మతానికో చెందిన వారు కాదని, ఆయన భారతజాతి గర్వించదగిన గొప్ప వ్యక్తి అని, 64 సబ్జెక్ట్ లలో మాస్టర్ డిగ్రీలు కలిగి, డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడు అని, లండన్ మ్యూజియం నందు కార్ల్ మార్క్స్ విగ్రహంతో పాటూ ఏర్పాటు చేసిన ఏకైక భారతీయుని విగ్రహం అంబేద్కర్ ది అని, 
అంబేద్కర్ 9 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన ప్రపంచ మేధావి అని, ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించే భాగ్యం కలగడం అదృష్టంగా భవిస్తానని అన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల