మాకవరపాలెంలో టిడిపికి మరో షాక్

పాపయ్యపాలెం, కొత్తపాలెం పంచాయతీల నుండి 100 కుటుంబాలు వైసిపిలో చేరిక

మాకవరపాలెంలో టిడిపికి మరో షాక్

IMG-20240503-WA0250

నర్సీపట్నం, పెన్ పవర్ :

మాకవరపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్  తగిలింది. పాపయ్యపాలెం, కొత్తపాలెం పంచాయతీల నుండి 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. శుక్రవారం మధ్యాహ్నం పెద్ద బొడ్డేపల్లి క్యాంపు కార్యాలయంలో వీరందరికీ ఉమాశంకర్ గణేష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల పార్టీలో చేరిన రుత్తల ఎర్రాపాత్రుడు మండలంలో తన సత్తా చాటుతున్నారు. సీనియర్ వైసీపీ నాయకులతో కలిసి ఏకంగా పంచాయతీలనే ఖాళీ చేసేస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ 30 వేల మెజారిటీకి ఇది నిదర్శనం అన్నారు. ఇంతమంది పార్టీలో చేరడం శుభసూచికమన్నారు. కులం, మతం, పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించడం వల్లే ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని గణేష్ అన్నారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు కుటుంబాలు బాగుండాలంటే టిడిపికి ఓటేయాలని, అదే మన కుటుంబం, మన సమాజం, మన రాష్ట్రం బాగుండాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అన్నారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉమాశంకర్ గణేష్ కోరారు.

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల