సీనియర్ టిడిపి నాయకుడు శేషుకుమార్ మృతి

స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి

సీనియర్ టిడిపి నాయకుడు శేషుకుమార్ మృతి

 

నర్సీపట్నం, పెన్ పవర్.IMG-20250329-WA0074

సీనియర్ టిడిపి నాయకుడు,  మాకవరపాలెం మండలం మాజీ జడ్పిటిసి రుత్తల శేషు కుమార్ అనారోగ్యంతో  మరణించారు. గతకొద్ది కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న శేషు కుమార్ శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు.  మండలంలోని ప్రజలందరికీ తలలో నాలికలా ఉండే శేషు కుమార్ అకాలంగా మృతి చెందడంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శేషు కుమార్ మరణించారన్న వార్త విన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శేషు కుమార్ పార్ధీవ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న శేషు కుమార్ మాకవరపాలెం సర్పంచిగా, ఎంపీటీసీగా,  జడ్పిటిసిగా, మండల పార్టీ అధ్యక్షుడుగా అనేక పదవులను అలంకరించారు.  తాజాగా రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ కమిటీలకు చైర్మన్ లను పార్టీ అదిష్టానం  ప్రకటించింది. అయ్యన్నపాత్రుడు సిఫార్సు మేరకు నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్గా శేషు కుమార్ పేరును శుక్రవారం ప్రకటించారు. ఆ మరుసటి రోజే శేషు కుమార్ మృతి చెందడం పార్టీ నాయకులను కలిచివేసింది. అదే విధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే పార్టీ సీనియర్ నాయకుడు మృతి చెందడాన్ని కార్యకర్తలు, నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన, నిబద్ధత కలిగిన నాయకుడును కోల్పోయామని అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. శేషు కుమార్ ను చివరిసారిగా చూసేందుకు మండల ప్రజలు బారులు తీరారు.

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల