ఎన్నికల ఫలితాలలోపు ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు

నర్సీపట్నం డియస్పీ మోహన్

ఎన్నికల ఫలితాలలోపు ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు

IMG20240521105001

 

నర్సీపట్నం, పెన్ పవర్ :

ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం డిఎస్పి మోహన్ హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పి మోహన్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఫలితాలు వెలువడే వరకు ప్రజలందరూ సమయం పాటించి, పోలీసులకు సహకరించాలన్నారు. ఇప్పటికే రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామని, ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం ఉదయం నర్సీపట్నం మున్సిపాలిటీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. ఈ తనిఖీలలో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న 68 ద్విచక్ర వాహనాలను, ఆటో, కారు, బొలెరో వాహనాలను గుర్తించి, పోలీస్ స్టేషన్ క తరలించమన్నారు. వీటికి సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకు వెళ్ళవచ్చు అన్నారు. అదేవిధంగా ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు నిర్వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని, అలాగే 144, 30 సెక్షన్లు అమలులో ఉన్నాయని, ఎక్కడ నలుగురికి మించి గుంపులుగా ఉండకూడదని, ప్రజలు అర్థం చేసుకొని పోలీసులకు సహకరించాలని డిఎస్పి మోహన్ కోరారు.

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల