మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పై రసవత్తరంగా సాగిన గ్రామసభ
గూడెం కొత్తవీధి,పెన్ పవర్ ఆగస్టు 23:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దామనపల్లి పంచాయతీ కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల నిమిత్తం స్థానిక సర్పంచ్ కుందేరి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభ రసవత్తరంగా సాగింది.ఈ గ్రామ సభలో పార్టీలకు అతీతంగా అందరూ ఒకచోట కూడి పంచాయితీ అభివృద్ధికై పనులను నిర్ణయించటం నిజంగా హర్షించదగ్గ విషయం. సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ గ్రామ సభలో మొదట సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో ఉన్న 18 గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పనులు, రైతులకు సంబంధించిన వ్యవసాయ అభివృద్ధి పనులకు దరఖాస్తులు చేయాలని కోరటంతో ప్రజలు తమ సమస్యలను సర్పంచ్ కు, సచివాలయం సిబ్బందికి అందించారు, ఈ కార్యక్రమంలో ప్రధానంగా మాజీ ఎంపీపీ సాగిన బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. బిజెపి నేత దుక్కేరి ప్రభాకర్ మాట్లాడుతూ పంచాయతీలో ఉన్న పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకొని వచ్చారు. వీఆర్పీలు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులను గురించి వివరించారు.అన్ని పార్టీల నాయకులు వచ్చినప్పటికీ అందరూ ఏకకంఠంతో పంచాయతీ అభివృద్ధి నిమిత్తం కూర్చొని పనుల తీర్మానం కొరకు చర్చించారు. సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 33 అంశాలకు సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు తీర్మానాలు చేయడం జరిగింది. సభధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే ప్రతి పనిని సద్వినియోగం చేసుకోవాలని, పంచాయతీల అభివృద్ధి కొరకు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమని తెలిపారు. అందరూ ఐకమత్యంగా ఉండి పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భీమరాజు ఉప సర్పంచ్ చిలకమ్మ, వీఆర్వో పద్మ, సెక్రటరీ కళ్యాణ్ కృష్ణ, వెల్ఫేర్ అసిస్టెంట్ పాత్రుడు, డిజిటల్ అసిస్టెంట్ శేఖర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ యుగంధర్, అగ్రికల్చర్ అసిస్టెంట్ జోసెఫ్, మహిళా పోలీస్ భారతి,వెటర్నరీ అసిస్టెంట్ బాలయ్య, సర్వేయర్ బుజ్జిబాబు, వైసిపి టిడిపి జనసేన పార్టీలకు చెందిన నాయకులు, వీఆర్పీలు, గ్రామ పెద్దలు గ్రామైక్య సంఘం వివోఏలు తదితరులు పాల్గొన్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.