పాడేరు డివిజన్ లో ఉన్న ప్రతీ ఆశ్రమ పాఠశాలల్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహించండి: కూడా సురేష్ కుమార్

వైయస్.ఆర్.సీ.పీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ కూడా.సురేష్ కుమార్

 

స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై25: అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండటంతో ఆశ్రమ పాఠశాలల్లో నివాసం ఉంటున్న విధ్యార్ధిని,విధ్యార్ధులు రోగాల భారిన పడే అవకాశాలున్నందున పాడేరు డివిజన్ 11మండలాలలో ఉన్న ప్రతీ ఆశ్రమ పాఠశాలలో మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని వైసిపి రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రెటరీ కూడా సురేష్ కుమార్ అధికారులను కోరారు.హాస్టల్స్ లో సరైన వసతులు అందుతున్నాయా లేదా! మంచినీటి వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా! స్కూల్ లో విద్యుత్ సరఫరా సక్రమంగా అందుతుందా చీకట్లో మగ్గుతున్నారా! విధ్యార్ధుల బాగోగులు చూడటానికి సంబంధిత ప్రధానోపాధ్యాయులు,వార్డెన్,అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేస్తున్నారా లేదా! స్కూల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా ఈ సీజన్ లో స్కూల్ లో ఫాగింగ్/స్ప్రేయింగ్ చేయించారా లేదా! విధ్యార్ధులు నివాసం ఉంటున్న భవనాలు శిధిలావస్థలో ఏవైనా ఉన్నాయా అన్న విషయం పట్ల క్షుణ్ణంగా ఆ మండలం పరిధిలో ఉన్న ఏ.టీ.డబ్ల్యూలు బాధ్యతగా చూడాలని ఈ సందర్భంగా కోరారు.

వాతావరణంలో

IMG-20240725-WA0000
వైసిపి ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కూడా సురేష్ కుమార్

మార్పులు వలన విధ్యార్ధులు జ్వరాలు,సీజనల్ వ్యాధులు,చర్మవ్యాధుల బారినపడే అవకాశం ఉన్నందున సంబంధిత స్కూల్ భాధ్యులు చొరవ తీసుకుని వైద్య సిబ్బందిని సంప్రదించి మెడికల్ క్యాంప్ నిర్వహించాలని ఆయన కోరారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల