ఎన్నికల కోడ్ దృష్టిలో పెట్టుకుని ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం:జేసి డా. అభిషేక్ 

స్టాప్ రిపోర్టర్/పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగష్టు13: ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎన్నికల కోడ్ దృష్టిలో పెట్టుకుని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సంయుక్త కలెక్టర్ డాక్టర్.ఎం.జె.అభిషేక్ ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ నుండి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జేసి మాట్లాడుతూ,ఉదయం 07.30 గంటలకు కలెక్టరేట్ లో జాతీయ జండాను ఎగురవేస్తారని,09.00గంటలకు తలారిసింగి పాఠశాల పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ జాతీయ జండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరిస్తారని తెలిపారు.పెరేడ్ అనంతరం శకటాలు పాడేరు వీధులలో తిరగాలని సూచించారు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబింధించిన ఏర్పాట్లపై ఆరా తీసారు.బుధవారానికి గ్రౌండ్, వేదిక, సీటింగ్ అరేంజ్మెంట్, మైక్ సిస్టం సిద్ధం చేయాలన్నారు.మాస్ డ్రిల్,IMG-20240813-WA0608 సాంస్కృతిక కార్యక్రమాలు రిహార్షల్స్ పూర్తి చేసి ప్రదర్శనకు సిద్ధం కావాలని ఆదేశించారు. మైదానంలో ఏర్పాటు చేయాల్సిన స్టాల్స్ సిద్ధం చేయాలన్నారు.పోలీస్ కవాతు, ఇతర ప్రదర్శనలు రిహార్శల్స్ పూర్తి చేయాలన్నారు.నిరంతర విధ్యుత్ సరఫరాకు విధ్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రంపచోడవరం నుండి సబ్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్,చింతూరు నుండి ఆర్డిఓ వి. చైతన్య, కలెక్టరేట్ నుండి డిఆర్ఓ బి.పద్మావతి, డిపిఆర్ఓ గోవింద రాజులు,ఎస్డిసి వివిఎస్ శర్మ, తదితరులు, జిల్లా నుండి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల