సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి,ఎన్డిఎ కూటమి నాయకుల సమక్షంలో రాజ్మా విత్తనాల పంపిణీ

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు28:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడా పంచాయతీ సచివాలయం-2 పరిధిలోని ప్రజలకు స్థానిక సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో 90 శాతం సబ్సిడీ ద్వారా అందించే రాజ్మా విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే రాజ్మా విత్తనాలను సబ్సిడీ ద్వారా పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారుల మాటలు నమ్మి విత్తనాలను దళారులకు విక్రయించవద్దు అని తెలిపారు.అలాగే ఈ పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కిల్లో ఈశ్వరమ్మ, ఉప సర్పంచ్ మడపల సోమేశ్ కుమార్,IMG-20240828-WA0802 వార్డు సభ్యులు సాగిన జోగి పడాల్,గెమ్మెలి ఫాల్స్.ఎన్డీఏ కూటమి నాయకులు మొట్టడం శరబన్న దొర,సేగ్గే సంజీవరావు, వడేలు పాండురాజు.వైసీపీ సీనియర్ నాయకులు బొబ్బిలి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.