రాజ్మా సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి:పెదవలస సర్పంచ్ కృష్ణవంశీ 

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 28:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం పెదవలస గ్రామపంచాయతీ సచివాలయ కేంద్రంలో స్థానిక సర్పంచ్ కృష్ణవంశీ, స్థానిక ఎంపీటీసీ సప్పగడ్డ ఆనంద్ ఆధ్వర్యంలో 90 శాతం సబ్సిడీ ద్వారా అందించే రాజ్మా విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గతంలో మాదిరిగా వ్యవసాయానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, రైతులు తమ కుటుంబ ఆర్థిక స్తోమత పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో రాజ్మా విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాజ్మా విత్తనాలు భూమిలో వేసిన తర్వాత ఈ పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. దళారుల మాయమాటలు నమ్మి విత్తనాలను దళారులకు విక్రయించవద్దు అని పేర్కొన్నారు.అగ్రికల్చర్ అసిస్టెంట్ రవీంద్ర మాట్లాడుతూ ఈ పంట నమోదు చేసుకోవడం వలన పంట నష్టం సంభవిస్తే ప్రభుత్వం నుండి లబ్ధి చేకూరే అవకాశం ఉందని కావున రైతులు ఈ పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు.అలాగే ప్రభుత్వం రైతులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని వాటిని రైతులు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు,వ్యవసాయ యంత్ర సామాగ్రి, సబ్సిడీపై సరఫరా చేయటానికి సిద్ధంగా ఉందని,ఈ విషయంపై కూడా రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించి తమ కావాల్సిన యంత్ర పరికరాలు సబ్సిడీపై తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చప్పగడ్డ ఆనంద్,IMG-20240828-WA0619 నాయకులు వీరోజీ త్రిమూర్తులు, తిమోతి, శ్రీరాములు,లంబసింగి రమేష్,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఎన్డీఏ కూటమి నాయకులు,రైతులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.