చింతపల్లి రహదారుల్లో విచ్చలవిడిగా పశువులు- వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం 

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,చింతపల్లి,పెన్ పవర్,ఆగస్టు 27: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో పశువులను విచ్చలవిడిగా వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.మంగళవారం సాయంకాలం జీసిసి పెట్రోల్ బంక్, కొత్త బస్టాండ్ పరిధిలో పశువులు విచ్చలవిడిగా రోడ్డుపైకి రావటంతో ప్రయాణం చేసే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. పశువుల వలన వాహనదారులకు,పాదచారులకు ఏదైనా ప్రమాదం పొంచుతుందోమని బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. పశువుల యొక్క యజమానులు పశువులను రోడ్ల పైన వదిలేయడంతో యజమానులకు పంచాయతీ అధికారులు తెలియజేయాలని స్పందించకపోతే చర్యలు చేపట్టాలని  పలువురు కోరుతున్నారు.

IMG_20240827_190229
రహదారుల్లో విచ్చలవిడిగా పశువులు- వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం 
Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.